సోమవారం, 3 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 1 జనవరి 2017 (09:37 IST)

రజనీకాంత్ అభిమానులకు న్యూ-ఇయర్ గిఫ్ట్.. యూట్యూబ్‌లో కబాలిలో తొలగించిన సీన్స్

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు ‘కబాలి’ నిర్మాత కలైపులి ఎస్‌.థాను కొత్త సంవత్సరం కానుక ఇచ్చారు. పా.రంజిత దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన ‘కబాలి’ చిత్రంలో నిడివి ఎక్కువైన కారణంగా తొలగించిన సన్నివే

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు ‘కబాలి’ నిర్మాత కలైపులి ఎస్‌.థాను కొత్త సంవత్సరం కానుక ఇచ్చారు. పా.రంజిత దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన ‘కబాలి’ చిత్రంలో నిడివి ఎక్కువైన కారణంగా తొలగించిన సన్నివేశాలను న్యూ ఇయర్‌ కానుకగా యూట్యూబ్‌లో విడుదల చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించిన కబాలి సినిమాపై తొలుత విమర్శకులు పెదవి విరిచినా రజనీకాంత్ స్టైల్‌ను ఆస్వాదించారు. ఆ స్పందనతోనే రజనీకాంత్ మరోసారి రంజిత్‌కు అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘2.ఓ’ తరువాత రజనీకాంత్ - పా.రంజిత్ కాంబినేషనలో చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది.
 
ఇదిలా ఉంటే..  ‘బాషా’ విడుదలైన ఇరవై ఏళ్ల తర్వాత రజనీకాంత్ మళ్లీ గ్యాంగ్‌స్టర్‌గా నటించిన సినిమా ‘కబాలి’. పా. రంజిత్ దర్శకత్వంలో ‘కలైపులి’ ఎస్.థాను నిర్మించిన ఈ సినిమాలో రజనీకాంత్‌ను చూపించిన తీరు ఆయన వీరాభిమానులకు తెగ నచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌ రానుంది. ఇటీవలే ఫిల్మ్ చాంబర్‌లో ‘కబాలి-2’ టైటిల్ రిజిస్టర్ చేయించారు. ఇందులో రజనీ లుక్‌పై చర్చ సాగుతోంది. ఈ చిత్రాన్ని ఆయన అల్లుడు ధనుష్ నిర్మించనున్నారు.