యూట్యూబ్‌లో దుమ్మురేపిన కబాలి ట్రైలర్.. టాప్ ట్రెండింగ్ ట్రైలర్‌గా రికార్డ్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, రాధిక ఆప్టే, ధన్సిక, కిషోర్, దినేష్ రవి, నాజర్, విన్‌స్టన్ చావ్, రిత్విక తదితరులు నటించిన కబాలి సినిమా మరో రికార్డును నమోదు చేసుకుంది. స్టైల్‌కు మారుపేరైన రజనీకాంత్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, రాధిక ఆప్టే, ధన్సిక, కిషోర్, దినేష్ రవి, నాజర్, విన్‌స్టన్ చావ్, రిత్విక తదితరులు నటించిన కబాలి సినిమా మరో రికార్డును నమోదు చేసుకుంది. స్టైల్‌కు మారుపేరైన రజనీకాంత్ ‘కబాలి’ చిత్రం ట్రైలర్ యూట్యూబ్‌లో దుమ్ముదులిపేసింది. 2016 లో యూట్యూబ్‌లో ఇది టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ ఏడాది టాప్ 10 ట్రెండింగ్‌లో ఉన్న వీడియోలు, మ్యూజిక్ వీడియోలు, బాలీవుడ్ ట్రైలర్ల జాబితాల గురించి యూట్యూబ్ వివరాలను వెల్లడించింది.
ఇందులో కబాలి హవా కొనసాగింది. టాప్ ట్రెండింగ్ ట్రైలర్‌గా కబాలి ఉండగా, హిందీలో ప్రసారమవుతున్న కపిల్‌శర్మ షోకు సల్మాన్ ఖాన్ అతిథిగా వెళ్లిన ఎపిసోడ్ టాప్ ట్రెండింగ్ వీడియోగా ఉంది. ఆర్‌బీఐ కొత్తగా తీసుకొచ్చిన రూ.2000 నోటుకి జీపీఎస్ చిప్ ఉంది అంటూ సోషల్ మీడియాలో ఎన్నో వదంతులు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై యూట్యూబ్‌లో పెట్టిన వీడియో కూడా ట్రెండింగ్‌లో ఉంది.
ఈ ఏడాది యూట్యూబ్‌లో సంగీతం అంశాన్ని పరిశీలిస్తే సిద్ధార్థ్ మల్హోత్రా, కత్రినా కైఫ్ నటించిన ‘కాలా చష్మా’ వీడియో 45 మిలియన్ల వ్యూస్‌తో టాప్‌లో ఉందని యూట్యూబ్ వెల్లడించింది.