శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 నవంబరు 2019 (18:03 IST)

మెగాస్టార్‌తో ఛాన్స్ కొట్టేసిన చెన్నై చంద్రం.. రెండో హీరోయిన్ ఎవరు? (video)

మెగాస్టార్ చిరంజీవితో మరోమారు నటించే అవకాశాన్ని చెన్నై చంద్రం త్రిష కొట్టేసింది. కొరటాలశివ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో త్రిషను మొదటి హీరోయిన్‌గా ఎంపిక చేయగా, రెండో హీరోయిన్ కోసం అన్వేషణ సాగుతోంది. 
 
ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ చిత్రం అతి త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. ఈ చిత్రంలో రెండో హీరోయిన్‌కి కూడా ఛాన్స్ ఉండ‌డంతో ఎవ‌రిని ఎంపిక చేయాల‌నే ఆలోచ‌న‌లో చిత్ర బృందం ఉంద‌ట‌. 
 
శృతి హాస‌న్ లేదా ఇలియానాల‌లో ఒక‌రు రెండో హీరోయిన్‌గా ఎంపిక కావొచ్చ‌నే టాక్ వినిపిస్తుంది. మ‌రి కొద్ది రోజుల‌లో చిత్ర న‌టీన‌టుల‌కి సంబంధించిన పూర్తి వివ‌రాలు బ‌య‌ట‌కి రానున్నాయి. కాగా, ఈ చిత్రం దేవాల‌యాల‌కు సంబంధించిన కథా నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఈ చిత్రాన్ని కూడా హీరో రామ్ చరణే నిర్మిస్తున్నారు.