సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 నవంబరు 2019 (09:02 IST)

రాహుల్‌ను గెలిపించింది శ్రీముఖినేనా?

బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్ టైటిల్ విన్నర్‌గా రాహుల్ నిలిచిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రూ.50లక్షల నగదు బహుమతిని దానితో పాటు ఓ ట్రోఫీని అందుకున్నాడు. దాదాపు 15 వారాల పాటు ఆసక్తికరంగా సాగిన ఈ షోలో అందరితో పోటి పడి చివరకు  రాహుల్‌ విజేతగా నిలిచారు. ముందుగా ఈ సీజన్‌ను శ్రీముఖి గెలుచుకుంటుందని అందరూ అనుకున్నారు. 
 
కానీ ఆమెకు రాహుల్ గట్టిపోటిని ఇచ్చాడు. అయితే టైటిల్ ఫేవరేట్‌గా ముందు వరుసలో రాహుల్, అలీ రెజా, బాబా బాస్కర్, శ్రీముఖి, వరుణ్ సందేశ్‌లు ఉండగా.. అందులో రాహుల్‌నే ప్రేక్షకుల గెలిపించారు. ఇందుకు కారణాలపై నెట్టింట పెద్ద చర్చే సాగుతోంది.
 
రాహుల్‌‌పై శ్రీముఖి ప్రవర్తన ఇందులో మొదటిదని అందరూ అభిప్రాయపడుతున్నారు. శ్రీముఖి ఎప్పుడూ టార్గెట్ చేస్తూ కావాలని రాహుల్‌ను రెచ్చగొట్టడం కలిసి వచ్చిందని తెలుస్తోంది. అదే సమయంతో శ్రీముఖిపై ఆడియన్స్‌లో నెగిటివ్ ఇంపాక్ట్ మొదలు కావడం కూడా రాహుల్‌‌ను గెలిపించిందని సినీ పండితులు అంటున్నారు.