గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 2 జనవరి 2019 (11:40 IST)

భర్తకు మాత్రమే అంకితం చేసేందుకు వర్జినిటీ అనేది నిధి కాదు.. కల్కి

బాలీవుడ్ నటి కల్కి కొచ్లిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. కన్యత్వమనేది నిధి కాదని కొచ్లిన్ తెలిపింది. పెళ్లి అయ్యేంతవరకు కన్యగా వుండి.. భర్తకు మాత్రమే అంకితం చేయడానికి వర్జినిటీ అనేది నిధి కాదని కల్కి బోల్డ్ కామెంట్స్ చేసింది. పెళ్లయ్యే వరకు సెక్స్‌కి దూరంగా వుండాలని అనడం ఏమిటని ప్రశ్నించింది. అది పూర్తిగా వారి వ్యక్తిగత విషయమని కల్లి చెప్పుకొచ్చింది.
 
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌ను వివాహం చేసుకున్న కల్కి కొంత కాలానికి తర్వాత అతడి నుంచి విడాకులు పొందింది. మీటూ ఉద్యమంలో భాగంగా సెక్స్ ప్రస్తావన సాగడంతో.. ఆడవాళ్లకు సెక్స్ విషయంలో నో అనేందుకు ఎంత హక్కు వుంటుందో.. అంతే హక్కు.. ఎస్ అని చెప్పే విషయంలోనూ వుంటుందని కల్కి తెలిపింది. ప్రస్తుతం కల్కి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.