శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 2 జనవరి 2019 (09:21 IST)

నాకు 24 గంటలూ నిద్రలేదు.. అందుకే పొగరుగా.. రష్మీ గౌతమ్

జబర్దస్త్ షో ద్వారా మంచి పేరు కొట్టేసిన రష్మీ గౌతమ్.. ప్రస్తుతం అభిమానులకు ఆన్‌లైన్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ మేరకు ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ధీటుగా సమాధానమిచ్చింది. తాజాగా ఎయిర్ పోర్టులో రష్మీ దురుసుగా ప్రవర్తించిందని.. ఆమె ప్రవర్తన సరిగ్గా లేదని ఓ ఫ్యాన్ చేసిన ట్వీట్‌కు రష్మీ ఘాటుగా సమాధానమిచ్చింది. 
 
తనకు 24 గంటలు నిద్రలేదని.. మూడు విమానాలు మారి అసలే నీరసంగా, అలసిపోతే అలాగే ప్రవర్తించాల్సి వుంటుంది. అందుకే పొగరుగా, దురుసుగా ప్రవర్తించాల్సి వచ్చింది. అయినా తన కెరీర్‌ బాగుంటుంది.. అంటూ ఆ ఫ్యాన్‌కు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపింది.. రష్మీ. 
 
అంతేగాకుండా తాను సౌమ్యంగా వుండాలని, పద్ధతిగా వుండాలని ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదని వెల్లడించింది. కాగా ఇటీవల ఆన్‌లైన్ ఇంటర్వ్యూలో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు రష్మీ సౌమ్యంగా బదులిచ్చిన సంగతి తెలిసిందే.