బుధవారం, 5 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 25 డిశెంబరు 2016 (14:40 IST)

'నీతో కష్టంరా బాబూ... నీకో దండం... నీతో మాట్లాడటం కష్టం: జూ.ఎన్టీఆర్‌తో కళ్యాణ్

నందమూరి వంశ హీరోలు జూనియర్ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌ల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. నీతో కష్టంరా బాబూ.. నీకో దండం... నీతో మాట్లాడటం కష్టం అంటూ చేతులు జోడించి దండం పెట్టిన సంఘటన తాజాగా జరిగింది. రోడ్డు

నందమూరి వంశ హీరోలు జూనియర్ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌ల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. నీతో కష్టంరా బాబూ.. నీకో దండం... నీతో మాట్లాడటం కష్టం అంటూ చేతులు జోడించి దండం పెట్టిన సంఘటన తాజాగా జరిగింది. రోడ్డు ప్రమాదంలో నందమూరి జానకిరామ్ అకాల మరణం చెందిన విషయం తెల్సిందే. దీంతో ఆయన పిల్లల ఆలనాపాలనను ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ చూస్తున్నారు. అన్నదమ్ములిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ తమ పెద్దన్న పిల్లలను పెంచి పెద్దవాళ్లను చేస్తున్నారు. జానకిరామ్‌ కుమారులు తారకరామారావు(13), సౌమిత్ర ప్రభాకర్‌(11)ల పంచెకట్టు వేడుక.. తూర్పుగోదావరి జిల్లా వేళంగిలో ఉంటున్న తాత యార్లగడ్డ ప్రభాకరరావు ఇంట్లో జరిగింది. 
 
సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ తన అన్న కల్యాణ్‌రామ్, నాన్న హరికృష్ణతో కలిసి కుటుంబ సమేతంగా ఆ కార్యక్రమానికి హాజరయ్యాడు. అక్కడ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ మధ్య సరదా సంభాషణ సాగింది. ఈ సందర్భంగా అన్నయ్య కల్యాణ్ రామ్.. తమ్ముడు ఎన్టీఆర్‌కు రెండు చేతులు జోడించి దండం పెట్టి..'నీతో కష్టంరా బాబూ.. నీతో మాట్లాడడం అంత ఈజీ కాదు' అని అన్నారు. ఎన్టీఆర్‌కు పురాణాలు, సాంప్రదాయలపై బాగా పట్టుంది. పంచెకట్టు కార్యక్రమంలో సంప్రదాయాల గురించి చర్చిస్తున్నప్పుడు ఎన్టీఆర్ మాటలు విని కల్యాణ్‌రామ్‌పై విధంగా స్పందించినట్టు తెలుస్తోంది.