మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసుదేవన్
Last Updated : శుక్రవారం, 29 మార్చి 2019 (14:21 IST)

'తుగ్లక్'గా రానున్న కల్యాణ్ రామ్

ఇటీవల '118' సినిమాతో విజయాన్ని సాధించిన కల్యాణ్ రామ్‌కి ఆయన నటనలోని కొత్తదనంతో మంచి మార్కులే పడ్డాయి. ఈ విజయం తెచ్చిపెట్టిన ఉత్సాహంతో ఆయన తన తదుపరి సినిమా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన వేణు మల్లిడి దర్శకత్వంలో తన తదుపరి సినిమాకి పచ్చ జెండా ఊపేసారట. 
 
కాగా... ఈ సినిమాకి 'తుగ్లక్' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలోని కథా కథనాలు.. తన పాత్ర.. తన లుక్ అన్నీ కొత్తగా ఉండేలా కల్యాణ్ రామ్ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేయనుండడం విశేషం. 
 
కల్యాణ్ రామ్ సొంత బ్యానర్లో రూపొందనున్న ఈ సినిమాలో కథానాయికలుగా రకుల్ .. కేథరిన్ పేర్లు వినిపిస్తున్నాయి... మరిన్ని వివరాలు కావాలంటే మరి కొన్నాళ్లు వేచి ఉండాల్సిందే...