బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 5 జులై 2017 (11:45 IST)

''ఒకే ఒక్కడు '' తరహాలో కమల్ హాసన్‌ను తమిళనాడుకు సీఎంగా చేయండి: ప్రేమమ్ ఆల్ఫోన్స్

అర్జున్ నటించిన ఒకే ఒక్కడు సినిమా గుర్తుందా? ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో ముదల్వన్ పేరుతో తెరకెక్కింది. తెలుగులో ఒకే ఒక్కడుగా విడుదలైంది. ఈ చిత్రంలో హీరోగా నటించిన అర్

అర్జున్ నటించిన ఒకే ఒక్కడు సినిమా గుర్తుందా? ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో ముదల్వన్ పేరుతో తెరకెక్కింది. తెలుగులో ఒకే ఒక్కడుగా విడుదలైంది. ఈ చిత్రంలో హీరోగా నటించిన అర్జున్ ఆ సినిమాలో ఒక్కరోజు సీఎం అవుతాడు. కట్ చేస్తే.. తమిళనాడు రాష్ట్రానికి విలక్షణ నటుడు కమలహాసన్‌ని ఒక్కరోజు ముఖ్యమంత్రిగా చేస్తే బాగుంటుందని ‘ప్రేమమ్’ ఫేం, మలయాళ దర్శకుడు ఆల్ఫోన్స్ పుత్రేన్ సోషల్ మీడియా ద్వారా అభిప్రాయపడ్డారు.
 
తమిళంలో వచ్చిన ముదల్వన్ సినిమా తరహాలో ఒక్కరోజు సీఎంను నియమించే అవకాశం ఉంటే.. తమిళనాడు ప్రజలను చూసుకునేందుకు కమలహాసన్‌ను ఒక్కరోజు సీఎంను చేయాలన్నారు. త్వరలోనే ఈ విధంగా జరుగుతుందని భావిస్తున్నానని, కేవలం ఒక్కరోజులోనే కమల్ తన వినూత్నమైన ఆలోచనలతో ప్రభుత్వాన్ని మెరుగైన స్థాయికి తీసుకెళ్తారని ఆల్ఫోన్స్ పుత్రేన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పనిలో పనిగా తాను ఏదైనా తప్పుగా మాట్లాడి వుంటే క్షమించాలని కోరారు. ఇది తన అభిప్రాయం మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు.