బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 21 ఫిబ్రవరి 2017 (09:54 IST)

అమ్మలేని రాజ్యంలో కమల్ 'విశ్వరూపం'.. ప్రజలారా మీ ఆగ్రహాన్ని చూపండి

ముఖ్యమంత్రి దివంగత జయలలిత కోట్లాది ప్రజానీకానికి అమ్మ. అలాంటి అమ్మలేని రాజ్యంలో సీనియర్ నటుడు కమల్ హాసన్ విశ్వరూపం చూపిస్తున్నారు. తనదైనశైలిలో తమిళనాడు రాజకీయాలపై ట్విట్టర్‌ కామెంట్స్ విసురుతున్నారు.

ముఖ్యమంత్రి దివంగత జయలలిత కోట్లాది ప్రజానీకానికి అమ్మ. అలాంటి అమ్మలేని రాజ్యంలో సీనియర్ నటుడు కమల్ హాసన్ విశ్వరూపం చూపిస్తున్నారు. తనదైనశైలిలో తమిళనాడు రాజకీయాలపై ట్విట్టర్‌ కామెంట్స్ విసురుతున్నారు. 
 
ప్రజలారా... మీ ఆగ్రహాన్ని గవర్నర్‌కు ఈ-మెయిల్‌ ద్వారా చెప్పండని కోరుతూ రాజ్‌భవన్‌ ఈమెయిల్‌ ఐడీని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ పిలుపుకు నిజంగానే ఆయన అభిమానులు పెద్ద ఎత్తున మెయిల్స్‌ పంపించారు. మొత్తంమీద ఆయన దూకుడు తమిళనాట సంచలనం సృష్టిస్తోంది.
 
ముఖ్యమంత్రి పీఠం నుంచి అమ్మ వారసుడు ఓ పన్నీర్ సెల్వంను దించేసి శశికళ బినామీ ఎడప్పాడి కె పళనిస్వామితో ప్రమాణ స్వీకారం చేయించారు. దీనిపై అన్నాడీఎంకే కార్యకర్తలే కాకుండా రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. వీరిలో పలువురు సినీ నటులు కూడా ఉన్నారు. 
 
ఇలాంటివారిలో కమల్ హాసన్ ఉన్నారు. ఈయన ఒక అడుగు ముందుకేసి ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. "ఇవ్వాళ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లాగా గతంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మైకులు పీక్కొని వెళ్లిన ఉదంతాలు మాకుగుర్తున్నాయి. టీవీ యాంకర్ల కుఅవి తెలుసుకొనేంత వయసు ఉండకపోవచ్చు. మరో సీఎం వచ్చారు. జై డె-మాక్‌క్రేజీ" అంటూ ట్వీట్ చేశారు.
 
అలాగే తమిళనాడు ప్రజలారా, మీ ఊళ్లో మీ ఎమ్మెల్యేకు ‘తగిన విధంగా’ స్వాగతం పలకండి., ప్రజలారా.. మీలో చెలరేగుతున్న భావాల్ని ఈమెయిల్‌ ద్వారా గవర్నర్‌తో పంచుకోండి అంటూ తాజాగా ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు.