గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 22 సెప్టెంబరు 2022 (21:38 IST)

మృణాల్ ఠాకూర్ నటన అద్భుతం.. కంగనా రనౌత్ ప్రశంసలు

mrunal thakur
సీతారామం సినిమాపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ హీరోయిన్ కంగనా రనౌత్‌పై ప్రశంసలు గుప్పించింది. ఈ సినిమాలో సీత పాత్రలో మృణాల్ ఠాకూర్ నటన అద్భుతమని కంగనా రనౌత్ కొనియాడింది. ఆ సినిమా గురించి కంగనా తన ఇన్‌స్టాలో పోస్టు పెట్టింది. 
 
సీతారామం సినిమాలో అందరూ బాగా నటించారని.. అయితే అందులో మృణాల్ నటన తనకు అద్భుతం అనిపించిందని కంగనా రనౌత్ పేర్కొంది. 
 
తను భావోద్వేగ పూరిత సన్నివేశాల్లో చాలా బాగా నటించిందని, అలా మరెవరూ నటించలేరని ప్రశంసించింది. "మృణాల్ నిజంగానే ఓ రాణి. జిందాబాద్‌ ఠాకూర్‌ సాబ్. ఇక ముందు ముందు కాలం మీదే" అంటూ ఇన్ స్టా పోస్ట్ లో పేర్కొన్నారు. తన పోస్టులో ఒక రాణి ఎమోజీని కూడా జత చేశారు.
 
కాగా.. ఆర్మీ నేపథ్యంలో రూపొందించినా, ఓ అందమైన ప్రేమకథగా సీతారామం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది.