గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (12:52 IST)

ఏపీలో ఆ ముగ్గురు మాత్రమే ట్రెండ్ సెట్టర్లు : వైకాపా ఎమ్మెల్యే

ravindranath reddy
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగ్గురు నేతలు మాత్రమే ట్రెండ్ సెట్టర్లుగా నిలిచారని వైకాపా ఎమ్మెల్యే రవీంధ్రనాథ్ రెడ్డి అన్నారు. ఆ ముగ్గురు ఎవరో కాదని, దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిలని చెప్పారు. 
 
శాసనసభలో విద్య, వైద్యం, నాడు - నేడు అనే అంశాలపై మంగళవారం అసెంబ్లీ స్వల్పకాలిక చర్చ జరిగింది. ఇందులో ఆయన మాట్లాడుతూ, ఏపీలో ట్రెండ్ సెట్టర్లుగా ఎన్టీఆర్, వైఎస్ఆర్, జగన్‌లు మాత్రమేనని అన్నారు. 
 
ముఖ్యమంత్రిగా చంద్రబాబు 14 యేళ్ల పాలనలో ప్రజలకు అన్నీ కష్టాలేనని చెప్పారు. పేదలు బతుకుదెరువు కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లకూడాదని, ఆత్మహత్యలకు పాల్పడరాదని పేదల పిల్లలు బాగా చదువుకోవాలని జగన్ ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని గుర్తుచేశారు.