మిస్ యూనివర్స్ పోటీలు.. పెళ్లైన వారు కూడా పాల్గొనవచ్చు...
మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో పాల్గొనేందుకు కఠినమైన నిబంధనలు వుంటాయి. ఈ పోటీల్లో పాల్గొనాలంటే కచ్చితంగా యువతులు పెళ్లి కాని వారై ఉండాలి. గర్భం ధరించి వుండకూడదు. అయితే కొత్తగా.. మిస్ యూనివర్స్ పోటీల్లో నిబంధనలు సవరించారు.
ఇకపై మిస్ యూనివర్స్ పోటీల్లో పెళ్లి అయిన వారు, పిల్లలు ఉన్నవారు కూడా పాల్గొనవచ్చని నిర్ణయం తీసుకుంది. 2023 నుంచి మిస్ యూనివర్స్ పోటీల్లో వీళ్లు కూడా పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది. మిస్ యూనివర్స్ పోటీల్లో పెళ్లైన వారిని కూడా అనుమతిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
మిస్ యూనివర్స్ పోటీల్లో తీసుకున్న నిర్ణయం పట్ల మిస్ యూనివర్స్ -2020 ఆండ్రియా మెజా స్పందించారు. టైటిల్ గెలిచిన తర్వాత ఈమె పెళ్లి చేసుకున్నట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు ఆండ్రియా మెజా. ఇకపోతే.. మిస్ యూనివర్స్ పోటీలు ప్రపంచ వ్యాప్తంగా 160పైగా దేశాలకు చెందిన మహిళలు పాల్గొంటారు.