సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 17 మే 2022 (15:08 IST)

అమ్మ గొప్పతనాన్ని చాటిన నాట్స్ వెబినార్; అమూల్యమైన అనుభవాలను పంచుకున్న మాతృమూర్తులు

mothers day
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మల గొప్పతనాన్ని చాటేలా వెబినార్‌ నిర్వహించింది. తల్లి ప్రేమను తమ బిడ్డలకే కాకుండా చాలా మంది, అమ్మ ప్రేమను పంచుతున్న కొందరు తల్లులతో కలిపి ఈ వెబినార్ నిర్వహించింది. 

 
రేపటి పౌరులను తీర్చిదిద్దడంలో అమ్మ పాత్రే కీలకమని ఈ సందర్భంగా మాతృమూర్తులు వివరించారు. ఈ వెబినార్ ప్రాముఖ్యతను జ్యోతి వనం వివరించారు. శర్వాణి సాయి గండూరి అమ్మ మీద పాడిన పాటతో ఈ వెబినార్ ప్రారంభమైంది. కవిత తోటకూర ఈ వెబినార్‌‌కు ప్రధాన వ్యాఖ్యతగా వ్యవహరించారు. కృష్ణవేణి శర్మ, రాధ కాశీనాధుని, ఉమ మాకంలు అమ్మగా తమ అనుభవాలను వివరించారు.

 
శ్రీక అలహరితో పాటు కొంతమంది చిన్నారులు అమ్మలపై వ్రాసిన కవితలు ఈ వెబినార్‌లో స్వయంగా వారే చదవి వినిపించారు. అమ్మ పట్ల తమ ప్రేమను చాటారు. ఇంకా ఈ కార్యక్రమంలో పద్మజ నన్నపనేని, లక్ష్మి బొజ్జ, గీత గొల్లపూడి, దీప్తి సూర్యదేవర, ఉమ మాకం, బిందు యలమంచిలి తదితరులు ఈ వెబినార్ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. అమ్మల అనుభవాలు, త్యాగాలు తెలుసుకుంటే మనలో అది ఎంతోకొంత స్ఫూర్తిని రగిలిస్తుందనే ఉద్ధేశంతోనే ఈ వెబినార్‌ను చేపట్టామని నాట్స్ బోర్డ్ ఛైర్మన్ అరుణ గంటి అన్నారు.

 
ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాట్స్ నాయకులు శ్రీనివాస్ కాకుమాను, రవి గుమ్మడిపూడి, మురళీకృష్ణ మేడిచెర్ల, సుధీర్ మిక్కిలినేని తదితరులు ఈ వెబినార్‌కు తమ వంతు సహకారం అందించారు. అమ్మల అనుభవాలను నేటి తరానికి పంచిన ఇంత చక్కటి వెబినార్‌ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ అధ్యక్షుడు విజయ్ శేఖర్ అన్నే ధన్యవాదాలు తెలిపారు.