మదర్స్ డే స్పెషల్.. ఆర్టీసీ జర్నీ ఫ్రీ.. సజ్జనార్ ప్రకటన
మదర్స్ డేను పురస్కరించుకుని తెలంగాణ ఆర్టీసీ బంపరాఫర్ ప్రకటించింది. ఆర్టీసీ బస్సుల్లో చంటి పిల్లలతో ప్రయాణించే మహిళల నుంచి టికెట్ వసూలు చేయబోమని ప్రకటించింది.
ఐదేళ్లలోపు పిల్లలతో వెళ్లే తల్లులు పూర్తి ఉచితంగా ప్రయాణించవచ్చని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు.
మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని తల్లులను అభినందించే ఉద్దేశంతోనే ఈ కానుకను అందిస్తున్నట్టు సజ్జనార్ చెప్పారు.
ఈ ఆఫర్ ఆదివారం ఒక్క రోజు మాత్రమేనని, చంటిపిల్లల తల్లులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.