గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 16 మే 2022 (11:53 IST)

వాకింగ్‌కు వెళ్లిన కన్నడ నిర్మాత మృతి.. రోడ్డు దాటుతుండగా..?

road accident
వాకింగ్‌కు వెళ్లిన కన్నడ నిర్మాత ప్రాణాలు కోల్పోయారు. 2003లో దర్శన్ కమర్షియల్‌ హిట్‌గా నిలిచిన చిత్రం 'కరియా'తో సహా ఆరు కన్నడ చిత్రాలను నిర్మించారు నిర్మాత అనేకల్‌ బాలరాజ్‌ (58). ఆయన తన కొడుకు సంతోష్ బాల్‌రాజ్‌ని 2009లో విడుదల చేసిన తన చిత్రం 'కెంప'లో ప్రధాన నటుడిగా పరిచయం చేశాడు.
 
వివరాల్లోకి వెళితే... కన్నడ కరియ, గణప లాంటి సినిమాలు నిర్మించిన నిర్మాత అనేకల్‌ బాలరాజ్‌ బెంగళూరు జేపీ నగరలో నివాసం వద్ద ఆదివారం ఉదయం వాకింగ్‌ చేసేందుకు వెళ్లారు. బాల్‌రాజ్‌ తన కారును రోడ్డు పక్కన ఆపి దాటబోతున్నారు. 
 
అంతలో ఆయనను ఓ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలరాజ్‌ తలకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా,  సోమవారం ఉదయం 10 గంటలకు మృతి చెందాడు. బాలరాజ్ మృతి పట్ల కన్నడ సినీ పరిశ్రమ సంతాపం వ్యక్తం చేసింది.