శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 మే 2022 (10:48 IST)

కన్నడ మహిళకు బెదిరింపు.. హిందీ మాట్లాడు.. వందేమాతరం అను అంటూ..?

kannada woman
kannada woman
హిందీని బలవంతంగా రుద్దేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న వేళ తాజాగా ఓ కన్నడ మహిళకు ఎదురైన అనుభవం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
హిందీ మాట్లాడమంటూ ఉత్తర భారతదేశానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఓ కర్ణాటక మహిళను ఒత్తిడి చేయడంతో పాటు బెదిరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
 
పడవల్లో బోటింగ్‌కు వెళ్లిన సమయంలో జరిగినట్టు కనిపిస్తున్న ఈ ఘటన.. ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే దానిపై స్పష్టత లేదు. కన్నడ భాష యాసను ఎగతాళి చేయడంతో పాటు 'హిందీ మాట్లాడు.. వందేమాతరం అను' అంటూ మహిళను బెదిరించారు. 
 
సదరు మహిళ ఎంతో ధైర్యంగా వారితో వాగ్వివాదానికి దిగింది. ఈ ఘటనపై సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.