శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (15:24 IST)

అమెజాన్ ప్రైమ్‌లో చెత్తను అమ్మకానికి పెట్టకండి.. కంగనా రనౌత్

Kangana _Deepika
బాలీవుడ్‌ హీరోయిన్ దీపిక పదుకొణే సినిమాపై కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. కున్ బత్రా దర్శకత్వంలో దీపిక పదుకొణే నటించిన "గెహ్రాయాన్" సినిమాలో సిద్ధాంత్ చతుర్వేదితో దీపిక‌ రొమాంటిక్ సీన్ల మోతాదు శృతి మించింద‌ని వ‌స్తోన్న విమ‌ర్శ‌ల‌పై కంగ‌నా ర‌నౌత్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించింది. చెడ్డ సినిమాలు ఎప్పటికీ చెడ్డ సినిమాలుగానే ఉంటాయ‌ని కంగనా చెప్పుకొచ్చింది. 
 
తాను కూడా నవ తరానికి చెందిన వ్యక్తినే కానీ, ఇటువంటి రొమాన్స్‌ని అర్థం చేసుకోగలనని కంగనా వ్యాఖ్యానించింది. దయచేసి కొత్త త‌రం యువ‌త, అర్బన్ సినిమాల పేరుతో ఇటువంటి చెత్తను అమ్మకానికి పెట్టకండంటూ ఆమె ఫైర్ అయ్యింది. గెహ్రాయాన్ సినిమా ఈ నెల‌ 11న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల‌ చేసింది.