గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 14 ఆగస్టు 2021 (07:24 IST)

కుర్ర‌కారుకు అందాలు చూపిస్తూ సూక్తులు చెబుతున్న కంగ‌నా

Kangana Ranaut
కంగ‌నా ర‌నౌత్ అంటేనే ఫైర్ బ్రాండ్‌. ఉన్న‌ది ఉన్న‌ట్లు అనేసి ఆ త‌ర్వాత ఏద‌యితే అయింద‌న్న‌ట్లు వుండే ఇప్ప‌టి జ‌న‌రేష‌న్‌కు స‌రిపోయే కేరెక్ట‌ర్‌. ఒక‌వైపు త‌లైవి అంటూ జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌లో పూర్తిగా వ‌స్త్రం ధ‌రిస్తుంది. మ‌రోవైపు ధ‌క్క‌డ్ అనే హిందీ మూవీలో హాట్ డ్రస్ లో కుర్రాళ్ల మతులు పొగొట్టింది. తాజా ఈ సినిమా ముగింపు సంద‌ర్భంగా ఓ పార్టీలో ధ‌రించిన ఈ ఫోజ్ త‌న సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేసింది.
 
Kangana Ranaut
కంగ‌నా సెక్సీ ఫొటో పెడుతూనే ప్రేమ‌ను మించిన జీవితం లేదు. జీవితంలో ప్రేమే ఓ భాగం అన్న కొటేష‌న్ కూడా ఇచ్చింది. ప్రేమ‌లోతుల్లో బాగా కూరుకుపోయి డిగ్రీలు సంపాదించిన భామ‌గా హిత‌బోధ చేస్తుంది. ఆ ప్రేమ అనేది వ‌య‌స్సును బ‌ట్టి కూడా వుంటుంది. అయితే ఈ కొటేష‌న్‌కు ప‌లువురు నెటిజ‌న్లు హాయ్ సెక్సీ.. అంటూ కామెంట్లుకూడా చేస్తున్నారు.
 
లాక్‌డౌన్ త‌ర్వాత త‌లైవి సినిమాను ఎప్పుడెప్పుడు చూడాలన్న త‌ప‌న ప్రేక్ష‌కురాలిగా త‌న‌కూ వుంద‌ని చెబుతోంది. జయలలితకు బాగా సూట‌య్యావ‌ని అంటున్నారు. కానీ వెండితెర‌పై త‌న‌ను తాను చూసుకోవాల‌నే ఉబ‌లాట‌ప‌డుతుంది. మ‌రోవైపు  ధ‌క్క‌న్ యూరప్ లో లాంగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసింది టీమ్.