1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 8 మార్చి 2024 (16:11 IST)

కన్యాకుమారి సినిమా నుంచి కత్తిలాంటి పిల్లవే.. లిరికల్ సాంగ్

Kanyakumari - Geet Saini
Kanyakumari - Geet Saini
గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ జంటగా నటిస్తున్న సినిమా "కన్యాకుమారి". ఈ చిత్రాన్ని రాడికల్ పిక్చర్స్ బ్యానర్ పై దర్శక నిర్మాతగా దామోదర రూపొందిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇవాళ మహా శివరాత్రి పండుగ సందర్భంగా "కన్యాకుమారి" సినిమా నుంచి 'కత్తిలాంటి పిల్లవే..' లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.
 
'కత్తిలాంటి పిల్లవే..' సాంగ్ కు దామోదర సృజన్ లిరిక్స్ అందించగా..సింగర్ ధనుంజయ్ పాడారు. రవి నిడమర్తి బ్యూటిఫుల్ గా ట్యూన్ చేశారు. 'కొట్టావే పిల్లా నువ్వు మనసుని కొల్లగొట్టావే..చేశావే పిల్లా నువ్వు గుండెను గుల్ల చేశావే..వయ్యారాల సొగసుతోటి, చిన్నదాన సొగసుతోటి..గుండెల్లోన గుద్దావే..నా చిట్టి గుండెనెక్కి తొక్కేసావే..కత్తిలాంటి పిల్లవే..కన్యాకుమారి..'అంటూ సాగుతుందీ పాట. "కన్యాకుమారి" సినిమా నుంచి ఇప్పటికే హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 'కత్తిలాంటి పిల్లవే..' సాంగ్ కూడా ఇన్ స్టంట్ హిట్ అయ్యేలా క్యాచీగా ఉంది. త్వరలోనే "కన్యాకుమారి" సినిమా రిలీజ్ డేట్ ను మూవీ టీమ్ అనౌన్స్ చేయనున్నారు.