1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 11 ఏప్రియల్ 2017 (09:44 IST)

చెలియా సినిమాకు కాపీ రైట్ తలనొప్పులు.. హాలీవుడ్ సినిమాను కాపీ కొట్టారా?

మణిరత్నం తెరకెక్కించిన చెలియా సినిమా వివాదంలో చిక్కుకుంది. కార్తీ- అదితిరావ్ జంటగా నటించిన ఈ సినిమా.. అభిమానుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. ప్రస్తుతం ఈ సినిమాకు కాపీ ఆరోపణలు మరింత తలనొప్పిగా మారాయి

మణిరత్నం తెరకెక్కించిన చెలియా సినిమా వివాదంలో చిక్కుకుంది. కార్తీ- అదితిరావ్ జంటగా నటించిన ఈ సినిమా.. అభిమానుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. ప్రస్తుతం ఈ సినిమాకు కాపీ ఆరోపణలు మరింత తలనొప్పిగా మారాయి. ఇందులో హీరో, ఇద్దరు సైనికులు పాకిస్థాన్ జైలు నుంచి తప్పించుకునే సన్నివేశాలను 'డిసెండెంట్స్‌ ఆఫ్‌ ది సన్' అనే హాలీవుడ్ మూవీ నుంచి కాపీ కొట్టారంటూ సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. 
 
అయితే ఈ సినిమా యూనిట్ ఖండించింది. 1971, డిసెంబర్ పదో తేదీన పాకిస్థాన్ సైనికులకు పట్టుబడిన వైమానికదళ లెఫ్టినెంట్ దిలీప్ పరుల్కర్ 'ఫోర్‌ మైల్స్‌ టు ఫ్రీడమ్‌' పేరుతో రాసిన పుస్తకం ఆధారంగానే వీటిని చిత్రీకరించినట్టు వెల్లడించింది. 
 
1972, ఆగస్టు 13న మల్వీందర్‌సింగ్‌ గ్రేవాల్‌, హరీష్‌ సిన్హాజీలతో కలిసి పరుల్కర్‌ రావల్పిండిలోని పీఓడబ్ల్యూ క్యాంప్‌ నుంచి తప్పించుకున్న వైనాన్ని ఆ పుస్తకంలో రాశారని గుర్తుచేసింది. వీటి ఆధారంగా సన్నివేశాలు చిత్రీకరించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.