'కాటమరాయుడు' పోస్టర్ చెప్పేదేమిటి?
నూతన సంవత్సర శుభాకాంక్షలతో పవన్ కళ్యాణ్ 'కాటరాయుడు' పోస్టర్ విడుదల చేయడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఫిలింనగర్‌లో సినీప్రముఖులు చర్చించేందుకు హాట్ టాపిక్‌గా మారింది. చిరంజీవి సినిమా సంక్ర
నూతన సంవత్సర శుభాకాంక్షలతో పవన్ కళ్యాణ్ 'కాటరాయుడు' పోస్టర్ విడుదల చేయడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఫిలింనగర్‌లో సినీప్రముఖులు చర్చించేందుకు హాట్ టాపిక్‌గా మారింది. చిరంజీవి సినిమా సంక్రాంతికి విడుదల కావడానికి రంగం సిద్ధం చేయడం... అందుకు ఇంకా తేదీని ప్రకటించకపోవడం ఒకటైతే.. నెమ్మదినెమ్మదిగా.. మూడురోజులకొకసారి ఓ పాటను విడుదల చేస్తూ జనాల్లో ఖైదీనెం.150 వస్తుందని ప్రచారం చేయడం జరుగుతుంది.
'అమ్మడు.. కుమ్ముడు..' వంటి పాటలు బయటకు వచ్చినా.. అవి ఈ వయస్సులో చిరంజీవిని ఇంకా చూస్తారా అనే అనుమానం కొందరిలో వుంది. ఏదిఏమైనా.. పవన్ కళ్యాణ్, చిరంజీవి మధ్య అంతర్గత వార్ ఎప్పుడూ నడుస్తూనే వుంది. భిన్నవైఖరి, మనస్తత్వం గల వీరి ప్రవర్తన.. ప్రజల్లో చర్చించుకునేందుకు వీలు కల్పించింది.
అయితే బుధవారం నాడు విడుదల చేసిన కాటమరాయుడు నూతన సంవత్సర పోస్టర్‌ను.. ఇప్పుడే ఎందుకు రిలీజ్ చేశారు.. అందరూ చిరంజీవి సినిమా గురించి మాట్లాడుకుంటుంటే.. తాను ఇప్పుడు రిలీజ్ చేయాల్సిన అవసరం ఏముందనేది ప్రధాన చర్చ. కానీ.. పవన్ రిలీజ్ చేసిన పోస్టర్‌కు అనూహ్య స్పందన రావడం విశేషం. అన్న సినిమా పబ్లిసిటీకి ఇది బ్రేక్ చేస్తుందా! అసలు.. కాటమరాయుడు షూటింగ్ ఇంకా పూర్తికాలేదు. అయినా.. ప్రేక్షకులకు, అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పాలనుకుంటే.. ఇంకా మూడు రోజులు సమయం వుందికదా. ఇదేరోజు ఖైదీనెం.150కు చెందిన మూడో పాట విడుదల కావడం... అదేరోజు కాటమరాయుడు పోస్టర్ విడుదల కావండ సర్వత్రా ఆసక్తి నెలకొంది.