శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (10:59 IST)

ఫిబ్రవరి 4న 4 గంటలకు 'కాటమరాయుడు' చిత్ర టీజర్...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శృతిహాసన్ కాంబినేషన్‌లో డాలీ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం కాటమరాయుడు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శృతిహాసన్ కాంబినేషన్‌లో డాలీ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం కాటమరాయుడు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. 
 
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అన్ని అనుకున్నట్టుగా జరిగితే మార్చి 29వ తేదీన విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ నిర్ణయించిన తేదీ కంటే ముందుగానే చిత్రం విడదలయ్యే అవకాశాలున్నట్లు టాక్. ఇదిలావుంటే టీజర్ మాత్రం ఇప్పటి వరకు విడుదల కాకపోవడం పట్ల అభిమానులు కొంత నిరుత్సాహానికి గురయ్యారు.
 
కాగా, ఈ చిత్రానికి సంబంధించి టీజర్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఫిబ్రవరి 4వ తేదీన 4 గంటలకు 'కాటమరాయుడు' చిత్ర టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ట్విట్టర్ ద్వారా తెలియచేసింది.