మంగళవారం, 28 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 28 డిశెంబరు 2016 (16:58 IST)

రణ్ బీర్‌తో బ్రేకప్‌కు కారణం ఏంటంటే..? కత్రీనా కైఫ్ చెప్తున్నది నిజమేనా?

బాలీవుడ్ లవ్ బర్డ్స్‌లా తిరిగిన కత్రినా కైఫ్-రణ్ బీర్ కపూర్ లవ్వాయణం బ్రేకప్ అయిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి బ్రేకప్‌కు కారణం మాత్రం ఇంకా తెలియరాలేదు. కానీ బిటౌన్ ఏమంటుందంటే.. రణ్ బీర్ కపూర్‌కు

బాలీవుడ్ లవ్ బర్డ్స్‌లా తిరిగిన కత్రినా కైఫ్-రణ్ బీర్ కపూర్ లవ్వాయణం బ్రేకప్ అయిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి బ్రేకప్‌కు కారణం మాత్రం ఇంకా తెలియరాలేదు. కానీ బిటౌన్ ఏమంటుందంటే.. రణ్ బీర్ కపూర్‌కు గల అఫైర్లేనని తెలిసింది. కత్రీనా రణ్ బీర్ ఫోన్‌ను తరచూ చెక్ చేసేదని.. అయితే ఈ వ్యవహారం రణ్ బీర్‌కు ఏమాత్రం నచ్చదని అందుకే ఆమెను పక్కనబెట్టేశాడని సినీ పండితులు అంటున్నారు. 
 
షికార్లు, సినిమాలతో సరిపెట్టకుండా సహజీవనం కూడా చేసిన ఈ జంట ఉన్నట్టుండి విడిపోయేందుకు కారణం ఏమిటా అని అందరూ చర్చించుకుంటున్నారు. కానీ ప్రేమలో ఉన్నప్పుడు మోసపోయిన సందర్భాలున్నాయని కత్రినా అంటోంది. అది రణ్ బీర్ చేతిలో అని ఆమె చెప్పడం లేదు కానీ, ప్రేమ బంధంలో ఉన్నప్పుడు తన పార్టనర్ వేరే ఆమెతో సంబంధం పెట్టుకోవడంతో తన ప్రేమ బ్రేకప్ అయ్యిందని కత్రినా కైఫ్ తెలిపింది.

అయితే రణ్ బీర్ పేరును ఆమె ప్రస్తావించలేదు. ప్రేమలో మోసపోయానని మాత్రం చెప్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమనేది.. రణ్ బీర్ నోరు విప్పితే కానీ తెలియదు.