శుక్రవారం, 21 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : గురువారం, 18 ఆగస్టు 2016 (16:02 IST)

ఖయ్యుమ్‌, నందినీ కపూర్‌ జంటగా 'డర్టీగేమ్‌'... షూటింగ్ షురూ

ఖయ్యుమ్‌, నందినీ కపూర్‌ జంటగా షిరిడి సాయి క్రియేషన్స్‌ పతాకంపై అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ దర్శకత్వంలో తాడి మనోహర్‌ కుమార్‌ నిర్మిస్తున్న పొలిటికల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రం 'డర్టీగేమ్‌'. ఆగస్టు 4 నుం

ఖయ్యుమ్‌, నందినీ కపూర్‌ జంటగా షిరిడి సాయి క్రియేషన్స్‌ పతాకంపై అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ దర్శకత్వంలో తాడి మనోహర్‌ కుమార్‌ నిర్మిస్తున్న పొలిటికల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రం 'డర్టీగేమ్‌'. ఆగస్టు 4 నుంచి షూటింగ్‌ ప్రారంభమైన ఈ చిత్రం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ మాట్లాడుతూ నిర్మాత కథను నమ్మి ఈ చిత్రాన్ని తీయడానికి ముందుకు రావడం మాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. అంతేకాదు ఖర్చుకి వెనకాడకుండా నిర్మాణాత్మక విలువలతో చిత్రీకరించడానికి అన్నివిధాలా తోడ్పాటుని అందిస్తున్నారు. 
 
ఈ సందర్భంగా మా నిర్మాత తాడి మనోహర్‌‌కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చిత్ర షూటింగ్‌ మొత్తం సింగిల్‌ షెడ్యూల్‌లో పూర్తి చేయనున్నాం అని అన్నారు. చిత్ర నిర్మాత తాడి మనోహర్‌ కుమార్‌ మాట్లాడుతూ దర్శకుడు పక్కా ప్లానింగ్‌తో ఈ చిత్రాన్ని చిత్రీకరిస్తున్నారు. సింగిల్‌ షెడ్యూల్‌లో చిత్రీకరణ జరిపేందుకు అన్ని ఏర్పాట్లు ముందుగానే చేసుకున్నాం. వర్తమాన రాజకీయ నేపథ్యంతో పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందిస్తూ పొలిటికల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం ఉంటుంది. 
 
చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. అక్టోబర్‌లో చిత్రాన్ని రిలీజ్‌ చేయనున్నాము. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే పూర్తి నమ్మకంతో ఉన్నాం అని అన్నారు. ఖయ్యుమ్‌, నందినీ కపూర్‌, పరుచూరి గోపాలకృష్ణ, సురేష్‌, అస్మిత, రమ్య, తాడి మనోహర్‌ నాయుడు, జబర్ధస్త్‌ టీమ్‌ మొదలగువారు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సునీల్‌ కశ్యప్‌, నిర్మాత: తాడి మనోహర్‌ కుమార్‌, కథ-మాటలు-పాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ.