ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 ఆగస్టు 2021 (11:12 IST)

కైరా అద్వానీ పారితోషికం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

మెగా పవర్ స్టార్ రాం చరణ్ 15వ చిత్రానికి క్రియేటివ్ జీనియస్ శంకర్ దర్శకత్వం వహించబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో స్టార్ హీరోయిన్ కియారా అద్వానీని చరణ్‌కి జంటగా ఎంచుకున్నారు. 
 
అయితే ఈ పాన్ ఇండియా మూవీకి కియారా రెమ్యునరేషన్ వింటే షాకవ్వాల్సిందే అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్‌తో కలిసి భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
 
నిర్మాణ సంస్థకి 50వ చిత్రం కాబట్టి దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని డిసైడయ్యాడు. తెలుగు, హిందీతో పాటు మిగతా సౌత్ భాషలలోనూ భారీ స్థాయిలో రూపొందించే సినిమా కనుక పాన్ ఇండియా రేంజ్ హిరోయిన్ కావాలని కియారాను తీసుకున్నారు.
 
అయితే ఈ సినిమాలో చేందుకు గాను ఆమెకి రూ.5 కోట్ల రెమ్యునరేషన్ ముట్టచెబుతున్నట్టు ప్రచారం అవుతోంది. ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళ సినిమాలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్‌గా క్రేజ్ ఉన్న పూజా హెగ్డే, రష్మిక మందలకి కూడా ఈ రేంజ్ రెమ్యునరేషన్ లేదు. 
 
కానీ గతేడాది వరకు 2 నుంచి మూడు కోట్లు అందుకునే కియారా ఇప్పుడు ఏకంగా 5 కోట్లంటే నోరెళ్ళబెడుతున్నారట. ఇందులో ఎంత నిజముందో అఫీషియల్‌గా మాత్రం కన్‌ఫర్మేషన్ లేదు.