శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 5 జూన్ 2017 (11:41 IST)

''లై''కోసం నితిన్ బిజీ బిజీ.. పవన్ నిర్మాత.. అమెరికాలో షూటింగ్

పవన్ కల్యాణ్‌‌కు నితిన్‌ అభిమాని అనే విషయం తెలిసింది. పవన్-నితిన్‌కి మధ్య మంచి సాన్నిహిత్యం వుంది. నితిన్ సినిమాల్లో పవన్ ప్రస్తావన తప్పకుండా ఉంటుంది. అలాగే నితిన్ సినిమా ఫంక్షన్స్‌కి పవన్ తప్పకుండా హ

పవన్ కల్యాణ్‌‌కు నితిన్‌ అభిమాని అనే విషయం తెలిసింది. పవన్-నితిన్‌కి మధ్య మంచి సాన్నిహిత్యం వుంది. నితిన్ సినిమాల్లో పవన్ ప్రస్తావన తప్పకుండా ఉంటుంది. అలాగే నితిన్ సినిమా ఫంక్షన్స్‌కి పవన్ తప్పకుండా హాజరవుతారనే విషయం తెలిసిందే. అలాంటి నితిన్‌తో పవన్ ఒక సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కథ, మాటలు త్రివిక్రమ్ అందిస్తున్నారు. 
 
ఈ సినిమాకు 'లై' (lie - లవ్ ఈజ్ ఎండ్ లెస్) అనే టైటిల్‌ను నిర్మాతలు రిజిస్టర్ చేయించారు. దాంతో ఈ సినిమా టైటిల్ ఖరారైనట్టు సమాచారం. నితిన్ కథానాయకుడిగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న లై సినిమా షూటింగ్ ప్రస్తుతం అమెరికాలో జరుగుతోంది. 
 
ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను హాలీవుడ్ నటుడు డాన్ బిల్జరియాన్ పోషిస్తున్నాడు. పలు హాలీవుడ్ చిత్రాల్లో నటించిన అయన ఈ సినిమాలో నటిస్తుండటం తమకి ఎంతో ఆనందంగా ఉందంటూ, లొకేషన్‌కి సంబంధించిన ఒక ఫోటోను నితిన్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈ సినిమా క్లైమాక్స్ భారీ స్థాయిలో ఉంటుందని టాక్ వస్తోంది.