వైజాగ్‌లో ఫిలిం సెంటర్ కట్టి తీరుతాం
వైజాగ్‌లో ఫిలిం సెంటర్‌కు ఇచ్చిన స్థలం బౌద్ధరామంకు సంబంధించిందనీ.. దీన్ని టీవీల్లో పలుసార్లు చూపిస్తూ సినిమా వారిని టార్గెట్ చేస్తూ.. నిందించడం సరైంది కాదని ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావు అన్నారు. ఇటీవలే వైజాగ్‌లోని బౌద్ధునికి సంబంధించిన స్థలాన్ని
వైజాగ్‌లో ఫిలిం సెంటర్‌కు ఇచ్చిన స్థలం బౌద్ధరామంకు సంబంధించిందనీ.. దీన్ని టీవీల్లో పలుసార్లు చూపిస్తూ సినిమా వారిని టార్గెట్ చేస్తూ.. నిందించడం సరైంది కాదని ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావు అన్నారు. ఇటీవలే వైజాగ్‌లోని బౌద్ధునికి సంబంధించిన స్థలాన్ని సినిమా వారికి ఇవ్వడం పట్ల అక్కడ బౌద్ధ మతానికి చెందిన కొందరు అడ్డుకున్నారు.
దాన్ని మీడియా ద్వారా వెల్లడిస్తూ ముఖ్యమంత్రి.. అమరావతిలో రాజధాని కట్టి బౌద్ధుని విగ్రహం కట్టి విదేశీయుల చేత అక్కడ క్యాష్ చేసుకుంటున్నారనీ అలాంటిది.. వైజాగ్‌లోని బౌద్ధుని స్థలాన్ని గ్రహించకుండా, చరిత్ర తెలీయకుండా సినిమాకి కట్టబెట్టడం దారుణమని వారంతా మీడియా ముందు వాపోతున్నారు. దీనికి సమాధానంగా కెఎస్ రామారావు, అశోక్ బాబు వంటి వారు హైదరాబాద్‌లో అత్యవర సమావేశం ఏర్పాటు చేసి ఫిలిం వారికి ఇచ్చిన స్థలానికి బౌద్ధునికి సంబంధం లేదని ఈ నెల 24 నుంచి తాము ప్రారంభోత్సం చేస్తామని ప్రకటించారు.