శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By tj
Last Updated : బుధవారం, 31 జనవరి 2018 (13:01 IST)

శ్రీవారి కటాక్షం వల్లే ఛాన్సులు : సినీనటి లావణ్య త్రిపాఠి

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దయతో కృపాకటాక్షాల వల్లే తనకు తెలుగు, తమిళ సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని సినీనటి లావణ్య త్రిపాఠి చెప్పుకొచ్చింది.

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దయతో కృపాకటాక్షాల వల్లే తనకు తెలుగు, తమిళ సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని సినీనటి లావణ్య త్రిపాఠి చెప్పుకొచ్చింది. ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. 
 
శ్రీనివాసున్ని దర్శించుకుంటే మనస్సుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుందని, తన ప్రతి సినిమా పూర్తయిన తర్వాత స్వామివారిని దర్శించుకుంటూనే ఉన్నానని, ఫిబ్రవరి 9వ తేదీన సాయిధరమ్ తేజ్‌తో కలిసి నటించిన "ఇంటిలిజెంట్" సినిమా విడుదల కాబోతుందని చెప్పారు. ఈ చిత్రం సక్సెస్ అయి, తమకు మరిన్ని అవకాశాలు వచ్చేలా చూడాలని శ్రీవారిని ప్రార్థించినట్లు చెప్పారు.