1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Lean avatar for Prabhas Adipurush: Dialogue Viral

ప్ర‌భాస్ ఆదిపురుష్ కోసం లీన్ అవతార్: డైలాగ్ వైర‌ల్‌

Lean avatar
Prabhas at airport
ప్రస్తుతం రాబోయే పీరియడ్ డ్రామా ఆదిపురుష్ షూటింగ్‌లో ఉన్న ప్రముఖ టాలీవుడ్ నటుడు ప్రభాస్ ఇటీవల హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు. వదులుగా ఉన్న తెల్లటి టీ-షర్టు బ్లాక్ స్నీకర్లతో తలను క్లాత్ తో కవర్ చేసి, ముఖానికి మాస్క్ ధరించి, వైట్ షేడ్స్ లో కనిపించాడు.

వ‌దులు దుస్తుల‌తో డాక్ట‌ర్‌లా క‌నిపించాడు. ఆయ‌న ఎయిర్‌పోర్ట్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తుంటే ఆయ‌న వెంట‌ ఎయిర్ పోర్ట్ అధికారి కూడా ముందుండి జాగ్రత్త‌గా తీసుకు వ‌చ్చారు. ఈ దృశ్యం అభిమాని త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసి, మంచి కామెంట్ పెట్టాడు. అది పెద్ద వైర‌ల్ అవుతోంది.
 
ఆ అభిమాని ట్విట్టర్‌లో ఇలా వ్రాశాడు, “బాస్, ఆదిపురుష్ కోసం లీన్ అవతార్. అంటూ పేర్కొన్నాడు. త‌ను ఓ చిన్న వీడియోకూడా పెట్టాడు. ఇటీవ‌లే ఆయ‌న హైద‌రాబాద్ వ‌చ్చారు. గురువారంనాడు ఆయ‌న పోస్ట్ చేశాడు. కోవిడ్-19 కారణంగా సినిమా షూటింగులు నిలిపివేయడంతో ప్రభాస్ తిరిగి హైదరాబాద్ చేరుకున్నట్టుగా తెలుస్తోంది. 
About Writer
ముర‌ళీకృష్ణ‌
తర్వాతి కథనం
ఇదే నా గ్లామ‌ర్ అంటోన్న సురేఖావాణి