గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 24 ఏప్రియల్ 2021 (18:29 IST)

ప‌వ‌న్‌క‌ళ్యాణ్ బ‌య‌ట‌పెట్టిన హీరోల‌ స్కెచ్ వైర‌ల్‌!

heroes seach
హీరోలంతా క‌లిసి టి, కాఫీ తాగ‌డానికి ఏదైనా కాఫీషాప్‌కు వ‌స్తే ఎలావుంటుంది ఊహించుకోవ‌డానికే థ్రిల్ క‌లుగుతుంది. అందుకే సాధ్య‌ప‌డ‌ని దానిని సాధ్య‌ప‌డేలా చేయ‌డం బొమ్మ‌లు గీయ‌డం. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీద అభిమానం వున్న హ‌ర్ష అనే ఆర్టిస్టు ఆరుగులు హీరోలు క‌లిసి మంచి స్నేహితులుగా తేనీటి విందు సేవిస్తున్న ఆర్ట్‌ను త‌న నైపుణ్యంతో గీశారు. దానిని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ త‌న ఇన్‌స్ర‌టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ స్టిల్ అభిమానుల‌ను అల‌రిస్తోంది.
 
 ఆర్టిస్టు తన పెన్సిల్ తో కలిపి అద్బుతంను ఆవిష్కరించాడు. అతడి అద్బుతం ఇప్పుడు నెట్టింట ఓ రేంజ్ లో ట్రెడ్డింగ్ అవుతుంది. ఆర్టిస్టు హర్ష వేసిన ఈ పెన్సిల్ ఆర్ట్ అందరు హీరోల అభిమానులు షేర్ చేసుకుంటున్నారు. హీరోలు అంతా కలిసి కాఫీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉన్నట్లుగా ఈ ఆర్ట్ లో హర్ష చూపించే ప్రయత్నం చేశాడు. అతడి ఆర్ట్ ఎలా ఉన్నా అతడి కాన్సెప్ట్ కు జనాలు ఫిదా అవుతున్నారు. అందరు హీరోలను ఒక్క చోటుకు చేర్చాలన్న మీ ఆలోచన నిజంగా అద్బుతం అభినందనీయం అంటూ నెటిజన్స్ హర్షపై కామెంట్స్ చేస్తున్నారు. ప్రముఖులు కూడా ఈ ఫొటోను షేర్ చేస్తున్న నేపథ్యంలో ఎక్కువ మందికి ఈ ఫొటో అనేది రీచ్ అవుతుంది.
 
 ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ లను చూడవచ్చు. టాలీవుడ్ ను ఏలేస్తున్న ఈ ఆరుగురి అభిమానులు ఈ ఫొటోను షేర్ చేస్తున్నారు. ఈమద్య కాలంలో అందరు హీరోల అభిమానులు షేర్ చేస్తున్న ఫొటోగా ఈ ఆర్ట్ నిలిచింది.