గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (14:27 IST)

పవన్ కళ్యాణ్‌కు కరోనా నెగటివ్.. పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలి

జనసేన అధినేత, సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. పవన్ కోవిడ్ బారినపడ్డారనే వార్త తెలియగానే ఫ్యాన్స్, సినీ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున పోస్టులు చేశారు. అయితే తాజాగా నిర్వహించిన పరీక్షల్లో పవన్ కళ్యాణ్‌కు నెగిటివ్‌గా నిర్దారణ అయింది. 
 
హైదరాబాద్‌లోని ట్రినిటీ ఆసుపత్రిలో పవన్ కోవిడ్ పరీక్ష చేయించుకున్నారు. పవన్‌కు కరోనా లక్షణాలు చాలా స్వల్పంగానే ఉండటంతో... ఆయన త్వరగానే కోలుకున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు జనసేన వర్గాలు గాని, ఆసుపత్రి వైద్యులు గాని అధికారికంగా వెల్లడించలేదు
 
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉదృతి కొనసాగుతోంది. కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో ఏపీ ప్రభుత్వం స్కూల్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. 1 నుంచి 9 వ తరగతి వరకు స్కూల్స్ కు సెలవలు ప్రకటించింది. అయితే, పదో తరగతి క్లాసులు యధావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం పేర్కొంది. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. 
 
పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కరోనా ఉదృతి సమయంలో టెన్త్ పరీక్షల నిర్వహణ ప్రభుత్వ మూర్ఖత్వమే అవుతుందని, లక్షల మంది విద్యార్థులు, కుటుంబాలను కరోనా ముప్పులోకి నెట్టుతున్నారని అన్నారు. టెన్త్ పరీక్షలు రద్దు చేసి పైతరగతులకు ప్రమోట్ చేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.