1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (10:20 IST)

తెలంగాణాపై పంజా విసిరిన కరోనా వైరస్.. కొత్తగా 6 వేల కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఒక్క రోజే దాదాపు 6 వేల వరకు కొత్త కేసులు నమోదు కావడం ఆందోళనను పెంచుతోంది. అంటే రాష్ట్రంలో కరోనా మహమ్మారి చాపకిందనీరులా విస్తరిస్తోంది. 
 
సోమవారం రాత్రి రాత్రి 8గంటల వరకు 1,22,143 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 5,926 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,61,359కి చేరింది. 
 
ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. అలాగే, సోమవారం కరోనాతో 18 మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,856కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 2,209 మంది కోలుకున్నారు. 
 
దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 3,16,656కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 42,853 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో నిన్న 793 కేసులు నమోదయ్యాయి.