శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 29 ఏప్రియల్ 2021 (19:26 IST)

అక్కడ వాడేసుకున్నావ్... పూనమ్ కౌర్ ట్వీట్, జుట్టు పీక్కుంటున్న నెటిజన్లు

పూనమ్ కౌర్. తెలుగు ఇండస్ట్రీలో అడపాదడపా చిన్నచిన్న పాత్రల్లో మెరుస్తుంటారు. ఐతే సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా వుంటారు. అప్పుడప్పుడు ఆమె చేసే ట్వీట్లు ఎవరిపైన చేసారో అర్థం కాక జుట్టు పీక్కుంటూ వుంటారు నెటిజన్లు, ఇప్పుడు అలాటి ట్వీట్ ఒకటి చేసి నెటిజన్ల మెదడుకు మేత పెట్టింది పూనమ్.
 
ఇంతకీ ఆమె వేసిన ట్వీట్ ఏంటయా అంటే... ఐడియాలు కాపీ, మరో వ్యక్తికి వ్యక్తిత్వాన్ని ఇమేజ్ క్రియేట్ చేసేసే మాస్టర్, నా ఐడియాలను లాగేసుకున్నాడు, వాటిని వేరే వాళ్లకి ఇచ్చాడు, కాపీ మాస్టర్ నిన్ను నేను క్షమించలేకపోతున్నా, నువ్వు అన్నింటినీ కాపీ చేసేసావ్, నీకు ఎక్కడైతే లాభం వస్తుందో అక్కడ వాడేసుకున్నావ్ అంటూ పూనమ్ ఆగ్రహంతో కూడిన ట్వీట్ చేసింది.
 
ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేసిందోనని నెటిజన్లు జుట్టు పీక్కుంటున్నారు. కనీసం ఆమె ఒక్క క్లూ కూడా ఇవ్వకపోయేసరికి.. మేడమ్ మేడమ్ అంటూ కొందరు బ్రతిమాలుతున్నారట.