పూనమ్ కౌర్‌కు నచ్చిన భంగిమ, ఐదుగురితో కలిసి...
నటి పూనమ్ కౌర్ ఈమధ్య తరచూ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా వుంటోంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ప్రకృతిని ఆస్వాదిస్తూ, మొక్కలకు నీళ్ళు పెట్టడం, మొక్కలు నాటటడం వంటి పోస్ట్ చేస్తూ తన స్నేహితులు, కుటుంబీలకుతో సరదాగా గడిపేస్తుంది.
ఆరోగ్యరీత్యా వ్యాయామాలు చేస్తుండే పూనమ్ కౌర్ యోగాను తూచ. తప్పకుండా పాటిస్తుందట. ఆసనాల్లో భాగంగా అందుకు తగిన భంగిమలను యోగాలో కొన్నింటిని చేస్తుంది. ఇందుకోసం స్నేహితులైన యోగిని పోర్టర్ల నుంచి నచ్చిన స్టిల్ క్లిక్ చేసుకుంటుంది. ఈరోజు అందులో ఓ భంగిమ తనకు బాగా నచ్చిందని పోస్ట్ చేసింది.
యోగా ఆగసనాలలో బురదలో కాసేపు వుండడం, బురదలో అవసరమైతే నృత్యం చేయడం వంటివి కొన్ని క్రియలు వున్నాయి. అందులో భాగంగా కొందరు గ్రూప్‌గా ఏర్పడి ముందుగా ఏర్పాటు చేసుకున్న బురదగుంటలో ఇలా విన్యాసాలు చేస్తుంటారు. అందులో తనకు ఈరోజు బాగా నచ్చిన భంగిమ ఇదంటూ పోస్ట్ చేసింది.
ఐదుగురు కలిసి బురదలో యోగ ఆసనాలు వేస్తుండగా ఫొటో క్లిక్ మంది. ఇలా చేయడం వల్ల ఎంత తీవ్రమైన ఎండలో వున్నా దేహానికి ఏమీ కాదు. వ్యవసాయంలో నారుమళ్ళు వేసే వారు, పంటపొలాల్లో పనిచేసేవారికి ఇది మామూలే. పూనమ్ కౌర్ లాంటి సెలబ్రిటీలకు ఇది కొత్తగానే వుంటుంది కదూ. అయితే ఈ ఐదుగురిలో తను ఎక్కడ వుందంటే, అది మనకే వదిలేసింది.