శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 18 జూన్ 2020 (18:36 IST)

నువ్వు చనిపోతే ఒక్కరోజు న్యూస్ అవుతావ్, అంతేనన్నాడు (Video)

బాలీవుడ్ యువహీరో సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న నేపధ్యంలో ఇపుడు సినీ ఇండస్ట్రీలో ఎవరెవరు మానసిక ఒత్తిడితో సతమతమవుతున్నారన్నది క్రమంగా బయటకు వస్తోంది. ఇదిలావుంటే తాజాగా టాలీవుడ్ బ్యూటీ పూనమ్ కౌర్ తను కూడా ఒకప్పుడు డిప్రెషన్‌తో ఇబ్బంది పడినట్లు ట్వీట్ చేసి షాక్ ఇచ్చారు.
 
అంతేకాదు అప్పట్లో.. తను తీవ్రమైన మానసిక ఒత్తిడితో వున్నాననీ, పరిస్థితి ఏమీ బాగాలేదనీ, ఆత్మహత్య చేసుకోవాలని వుంది, నాతో కాసేపు మాట్లాడమని అడిగితే, ఆ దర్శకుడు తనకు షాకింగ్ రిప్లై ఇచ్చాడని గుర్తు చేసుకుంది. అతడు తనతో సరిగా వ్యవహరించలేదనీ, పైగా ఏమీ జరగదు... నువ్వు చనిపోతే ఒక్క రోజు న్యూస్ అవుతావంతే అంటూ తనను ఎగతాళి చేస్తూ మాట్లాడాడని వెల్లడించింది.
అతడి మాటలు తనకు విరక్తి తెప్పించాయని ఆ దర్శకుడు ఎన్నో రంగాలను కంట్రోల్ చేస్తున్నాడనీ, అలాంటివాడు తనతో ఇలా మాట్లాడటం తన ఆత్మవిశ్వాసంపై దెబ్బకొట్టినట్లయిందని గుర్తు చేసుకుంది. ఐతే అతడికి సరైన సమాధానం ఇచ్చాననీ, డిప్రెషన్ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నట్లు పూనమ్ వెల్లడించింది. ఐతే తనతో అలా మాట్లాడిన దర్శకుడు ఎవరన్నది మాత్రం బయటపెట్టలేదు.