సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 12 మార్చి 2021 (16:32 IST)

దాది హృదయ మోహిని మృతి పట్ల గవర్నర్ సంతాపం

ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో బ్రహ్మ కుమారి సంస్ధ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ రాజయోగి దాది హృదయమ్ మోహిని గురువారం ఆకస్మిక మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గవర్నర్ శ్రీ హరిచందన్ మాట్లాడుతూ 1936 లో 8 సంవత్సరాల వయసులో బ్రహ్మ కుమారి సంస్ధలో చేరిన దాది హృదయ మోహిని, ఆ సంస్థ సేవలో తన జీవితాన్ని అంకితం చేశారన్నారు.
 
ఆధ్యాత్మిక భావన, సాధన, ఆత్మ చైతన్యం, ధ్యానంల ద్వారా ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మ కుమారిల కుటుంబం సానుకూల సందేశం వ్యాప్తికి కృషి చేసారన్నారు. నమ్మిన సిద్దాంతం కోసం రాజయోగిని దాది హృదయ మోహిని తన జీవితాన్ని అంకితం చేశారని గవర్నర్ హరిచందన్ అన్నారు. బ్రహ్మ కుమారి సంస్థ సభ్యులకు గవర్నర్ శ్రీ హరిచందన్ హృదయపూర్వక సంతాపం తెలిపారు.