శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 12 మార్చి 2021 (16:02 IST)

ఉత్తరాంధ్రలో భగభగమంటున్న భానుడు, 40 డిగ్రీలకు చేరువగా ఉష్ణోగ్రత

గత రెండు రోజులలో తెలుగు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. అదే సమయంలో వేడి గాలులు కూడా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా తీరప్రాంత జిల్లాల్లో తూర్పు గోదావరి జిల్లాలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో వారంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరుకుంటుందని వాతావరణ కార్యాలయం అంచనా వేసింది. 
 
విశాఖపట్నం జిల్లాలోని వేడి గాలులు కూడా 36 డిగ్రీల ఉష్ణోగ్రతతో పెరిగాయి. మరికొన్ని జిల్లాల్లో పరిస్థితి కూడా ఇలాగే వుంది. ప్రతి జిల్లాలో 30 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండలు పెరిగినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
 
కొన్ని ప్రాంతాల్లో వింత వాతావరణ పరిస్థితులు కనిపిస్తాయి. పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, రాత్రి సమయంలో అత్యల్పం కనిపించింది. రాయలసీమాలో రాత్రి ఉష్ణోగ్రతలు కూడా తక్కువగా ఉన్నాయి.