సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 మార్చి 2021 (18:46 IST)

ఏపీలో పెరిగిన కరోనా కేసులు.. 120మందికి పాజిటివ్.. వ్యాక్సిన్ రికార్డ్

ఆంధ్రప్రదేశ్‌ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 48,973 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 120 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 
 
గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ఒకరు మృతి చెందారు. అదే సమయంలో 93 మంది రికవరీ అయ్యారు. దీంతో.. పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,91,004 కి చేరగా.. కోలుకున్నవారి సంఖ్య 8,82,763 కి చేరింది. ఇక, ఇప్పటి వరకు కరోనాతో 7,177 మంది మృతిచెందారు. 
 
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ శరవేగంగా జరుగుతోంది. సోమవారం ఒక్కరోజే 20 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు ఇదే అత్యధికమని తెలిపింది. ఈ నెల 8 నాటికి వ్యాక్సినేషన్ డ్రైవ్ కు 50 రోజులైందని.. ఆ రోజు 20,19,723 మందికి టీకా వేశామని చెప్పింది.
 
వీరిలో 17,15,380 మందికి ఫస్ట్ డోస్.. 3,04,343 మందికి సెకండ్ డోస్ ఇచ్చామని వివరించింది. ఫస్ట్ డోస్ తీసుకున్నోళ్లలో 60 ఏండ్లకు పైబడినోళ్లు 12,22,351 మంది, 45 ఏండ్లకు పైబడి కోమార్బిటీస్ ఉన్నోళ్లు 2,21,148 మంది ఉన్నారంది.