ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 12 మార్చి 2021 (10:12 IST)

క్రికెట్ లో ఆ మాజీ మంత్రి బిజీ.. ఎవరో తెలుసా?

రాజకీయాలకు గుడ్‌బై చెప్పేసిన మాజీ మంత్రి ఎన. రఘువీరారెడ్డి స్వగ్రామంలో హాయిగా కాలక్షేపం చేస్తున్నారు. ఈ  క్రమంలో తాజాగా ఆయన గురువారం యువకులతో కలసి క్రికెట్‌ ఆడారు.

అనంతపురం జిల్లా నీలకంఠాపురం ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించే క్రికెట్‌ ఆటను రఘువీరారెడ్డి ప్రారంభించారు. ఈ క్రికెట్‌లో రఘువీరారెడ్డి బ్యాటింగ్‌ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, అందరూ క్రీడా స్ఫూర్తిని చాటాలని తెలిపారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా బాగా రాణించాలని మాజీ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో గంగులవాయిపాళ్యం, గోవిందాపురం సర్పంచులు కళావతి, అనితా లక్ష్మీ, మాజీ మార్కెట్‌యార్డు ఛైర్మన నరసింహమూర్తి, విద్యార్థులు పాల్గొన్నారు.