శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 28 ఏప్రియల్ 2021 (20:35 IST)

అమూల్యకు తోడుగా బంటూ వచ్చినట్టున్నాడు: పూజా హెగ్దె ట్వీట్

అలవైకుంఠపురం జోడీ అల్లు అర్జున్-పూజా హెగ్దె కరోనావైరస్ బారిన పడ్డారు. ఈ నెల 25న పూజా హెగ్దెకి కరోనా సోకింది. దీనితో ఆమె హోం ఐసొలేషన్లోకి వెళ్లిపోయారు. వైద్యుల సూచన మేరకు చికిత్స తీసుకుంటున్నారు.
 
ఇంతలో అల్లు అర్జున్ తనకు కరోనా సోకిందంటూ ట్వీట్ చేయడంతో ఫ్యాన్స్ ఎమోషన్ అయ్యారు. టేక్ కేర్ #Anna అనే ట్యాగ్‌తో ట్వీట్లు చేస్తున్నారు. ఇదిలావుంటే అల్లు అర్జున్ చేసిన ట్వీట్ పైన పూజా హెగ్దె వెరైటీగా అల వైకుంఠపురం చిత్రంలోని పాత్రల పేర్లతో స్పందించారు.
 
బంటూ(అల్లు అర్జున్ పాత్ర పేరు) అమూల్య(పూజా పాత్ర పేరు)కు తోడుగా వుండేందుకు వచ్చినట్లున్నాడు. జాగ్రత్తగా వుండండి అల్లు అర్జున్, ఈ ట్వీట్ తో మీకు నేను కొంచెం శక్తిని పంపిస్తున్నాను. నువ్వెప్పుడూ బాగానే వుంటావు అని ట్వీట్ చేసారు.