శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 17 ఏప్రియల్ 2021 (11:46 IST)

హలో పవన్ ఫ్యాన్స్.. కరోనా వైరస్‌ను పచ్చడి పచ్చడి చేసి చంపేయండి: వర్మ ట్వీట్లు

ఊరందరిదీ ఒక దారి అయితే ఉలిపిరి కట్టది మరో దారి అనే సామెత గురించి మనకు తెలుసు. ఇక్కడ ఆ సామెత ఎందుకంటే.. ఒకవైపు పవన్ కళ్యాణ్ కరోనావైరస్ సోకి ట్రీట్మెంట్ తీసుకుంటుంటే... ఆయన త్వరగా కోలుకోవాలని ఎంతోమంది సందేశాలు పంపుతున్నారు. కానీ రాంగోపాల్ వర్మ మాత్రం ఎప్పటిలాగే తనదైన స్టయిల్లో ట్వీట్లు చేసారు.
 
ఇంతకీ ఆయన చేసిన ట్వీట్టు ఏమిటంటే... పవన్ కళ్యాణ్ అభిమానులూ.. వెంటనే ఆ వైరస్‌ను పచ్చడి పచ్చడి చేసి చంపేయండి అంటూ ఓ ట్వీట్ చేసారు. ఆ తర్వాత మళ్లీ... పవన్ ఇలా మంచాన పడటానికి కోవిడ్ కారణం కాదు, వేరే హీరో అభిమానులే అని ట్వీటారు.
 
మరో ట్వీట్లో పవన్ మంచంపై పడుకుని ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఫోటో షేర్ చేస్తూ.. ఈ ఫోటోలో ఏదో తప్పు కనిపిస్తోంది, దానిని వెతికి పట్టేసినవారికి రివార్డు ఇస్తా అంటూ కామెంట్ చేసారు. ఈ కామెంట్లు చూసిన పవన్ ఫ్యాన్స్ గరంగరం అవుతున్నారు. తమ అభిమాన హీరో అనారోగ్యం పాలయితే వర్మకు కామెడీగా వుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై వర్మ మళ్లీ ఎలా స్పందిస్తాడో చూడాలి.