మంగళవారం, 1 ఏప్రియల్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శనివారం, 29 మార్చి 2025 (18:38 IST)

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Uday Raj, Vaishnavi Singh
Uday Raj, Vaishnavi Singh
ఉదయ్ రాజ్, వైష్ణవి సింగ్ జంటగా రాజేష్ చికిలే దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం మధురం. శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై  యం.బంగార్రాజు నిర్మించారు.  ఎ మెమొరబుల్ లవ్ అనేది ట్యాగ్ లైన్. టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ తో సహా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతోంది. ఏప్రిల్ 18న గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుంది.
 
ఈ సందర్భంగా హీరో ఉదయ్ రాజ్ మాట్లాడుతూ, ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. అలాగే దర్శకుడు రాజేష్ అత్యద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మా కెమెరామెన్ మనోహర్ ఎక్సలెంట్ ఫోటోగ్రఫీ చేశారు. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ వెంకీ వీణ సూపర్బ్ సాంగ్స్ ఇచ్చారు. మధురం ఎ మెమొరబుల్ లవ్.. ఇట్స్ ఎ  క్లీన్ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్.. అందరూ ఎంజాయ్ చేసే విధంగా ఈ చిత్రం ఉంటుంది.  ఈ సినిమా నాకు టర్నింగ్ పాయింట్ అవుతుంది" అని అన్నారు.
 
 చిత్ర దర్శకుడు రాజేష్ చికిలే మాట్లాడుతూ.. '1990 నేపథ్యంలో జరిగే  టీనేజ్ లవ్ స్టోరీ ఇది.  అప్పటి స్కూల్ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్ళకు కట్టిన్నట్లు  చూపిస్తూ.. ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. సినిమా చూశాక అప్పటి వాళ్ళ స్కూల్ డేస్.. కాలేజ్ డేస్ గుర్తుకు తెచ్చేలా ఈ మూవీ ఉంటుంది. ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని రూపొందించాం. మా నిర్మాత బంగార్రాజు మా వెన్నంటే ఉండి సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేశారు.  అలాగే మా డిఓపి మనోహర్ బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చాడు. ఈ సినిమా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది" అని చెప్పారు.
 
 నిర్మాత యం బంగార్రాజు మాట్లాడుతూ.. "రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా  ఈ చిత్రాన్ని తెరకెక్కించాం.  పోస్ట్ ప్రొడక్షన్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం. ఏప్రిల్ 18న సినిమా విడుదల చేస్తున్నాం. ఇప్పటికే నితిన్ గారు రిలీజ్ చేసిన టీజర్ కు మంచి స్పందన లభించింది. సినిమా కూడా అందరికీ నచ్చేలా ఉంటుంది" అని అన్నారు.
 
హీరోయిన్ వైష్ణవి సింగ్ మాట్లాడుతూ.."ఇదొక యూత్ ఫుల్ ఎంటర్టైనర్. ఇందులో నా క్యారెక్టర్ అందరిని అలరిస్తుంది.  ఉదయ్ రాజ్ చాలా సపోర్ట్ చేశారు.  ఇలాంటి మంచి కాన్సెప్ట్ లో  అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్" అని చెప్పారు.