భర్తను పరిచయం చేసిన నటి అభినయ!!
సినీ నటి అభినయ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. హైదరాబాద్ నగరానికి చెందిన సన్నీవర్మ అనే వ్యక్తితో ఈ నెల 9వ తేదీన అభినయకు నిశ్చితార్థం జరిగిన విషయం తెల్సిందే. కాబోయే భర్తను పరిచయం చేస్తూ అతనితో కలిసి దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేసారు. త్వరలోనే తాను పెళ్లి చేసుకోబోతున్నట్టు వెల్లడించారు. సినీ అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కాగా, పుట్టుకతోనే చెవిటి, మూగ అయినప్పటికీ అభినయ సినిమాల్లో అద్భుతంగా నటిస్తూ ప్రతి ఒక్కరితో శెభాష్ అనిపించుకుంటున్నారు. గతంలో 'ధృవ', 'శంభో శివ శంభో', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'రాజుగారి గది-2' వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.