సోమవారం, 31 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 28 మార్చి 2025 (12:21 IST)

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

marriage with lover
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో బబ్లూ అనే వ్యక్తి తన భార్య రాధికను ఆమె ప్రియుడు విశాల్‌ కుమార్‌కు ఇచ్చి పెళ్లి జరిపించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది. అయితే, తాజాగా అతడు అలా ఎందుకు చేశాడో వివరించాడు.
 
ఇటీవలి రోజుల్లో భర్తలను వారి భార్యలు చంపడం మనం చూశాను అని బబ్లూ వార్తా సంస్థ పీటీఐతో అన్నాడు. ఇటీవల దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన మీరట్ ఘటనే తాను ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమైందన్నాడు. 
 
మీరట్‌లో ఏమి జరిగిందో చూసిన తర్వాత తామిద్దరం ప్రశాంతంగా జీవించగలిగేలా నా భార్యను ఆమె ప్రియుడుతి వివాహం చేయాలని నిర్ణయించుకున్నాను అని బబ్లూ చెప్పుకొచ్చాడు. 
 
కాగా, వేరే రాష్ట్రానికి వెళ్లి కూలి పనులు చేసే బబ్లూ గత 2017లో రాధిక అనే మహిళను పెళ్లి చేసుకోగా, వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో రాధికకు స్థానికంగా ఉండే విశాల్ అనే యువకుడుతో పరిచయం, ప్రేమ, వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుకున్న బబ్లూ.. తన భార్యకు, ఆమె ప్రియుడుకి వివాహం జరిపించాడు.