శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 మే 2020 (11:44 IST)

మహేష్ కొత్త లుక్ అదిరిందిగా.. పిల్లలతో ఫుల్ షేవ్‌, లాంగ్ హెయిర్‌తో..?

Mahesh Babu
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త లుక్ అదిరిపోయింది. కుమార్తె సితారతో కలిసి మహేష్ బాబు గడ్డం లేకుండా వున్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన మహేష్ బాబు తన కొత్త లుక్‌కు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పెద్ద కళ్ళజోడు, ఫుల్ షేవ్, లాంగ్ హెయిర్‌తో చాలా క్యూట్‌గా ఉన్నాడు. 
 
కొత్త సినిమా కోసం ఏమైనా ఇలా లుక్ మార్చాడా లేదంటే లాక్ డౌన్‌లో న్యూ లుక్ కోసం ట్రై చేస్తున్నాడా అన్నది పక్కన పెడితే, ఈ లుక్ మాత్రం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 
 
మహేష్ బాబు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ ఫోటోకు విపరీతమైన లైకులు, షేర్లు వస్తున్నాయి. లాక్ డౌన్ ముగిసిన వెంటనే మహేష్ బాబు, పరశురామ్ సినిమా ప్రారంభం అవుతుంది. సితార, కుమారుడితో కలిసివున్న ఫోటోలను మహేష్ భార్య నమ్రత సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఆయన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 
 
ఇకపోతే.. మే 16వ తేదీన నమ్రత సితారతో మహేష్ ఆడుకుంటున్న వీడియోను పోస్టు చేశారు. లిటిల్ టెడ్డీ కన్సర్ట్‌తో ఈ వీడియో అదిరింది.