శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (20:38 IST)

దుబాయ్ ఇన్ 5 బిల్డింగ్‌లో మ‌హేష్‌ బాబు షూటింగ్‌

Mahesh babu, dubai Shooting
మహేష్ బాబు, కీర్తి సురేశ్ జంట‌గా న‌టిస్తున్న సినిమా షూటింగ్ దుబాయ్‌లో జరుగుతుంది. దుబాయ్‌లో ప్లేస్ ఎక్క‌డో అని చ‌ర్చ అభిమానుల్లో నెల‌కొంది. ఇటీవ‌లే సోష‌ల్ ‌మీడియాలో కీర్తి ఓ ఫొటోను పెట్టింది. అందులో ఆమె బేంక్ రెసెప్స‌నిస్ట్‌గా చేస్తున్న‌ట్లు వెబ్‌దునియా తెలిపింది. అంత‌కుముందు మ‌హేష్‌బాబు సినిమా కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్త‌న్న‌ట్లు కీర్తి సురేష్ ప్ర‌క‌టించి తాను ప్ర‌యాణిస్తున్న ఫోటోల‌ను కూడా పోస్ట్ చేసింది. 
 
స‌హ‌జంగా స్టార్ హీరో షూటింగ్ అంటే ఎక్క‌డ‌నే ఆస‌క్తి వుంటుంది. అలాగే మ‌హేష్ షూటింగ్ దుబాయ్‌లో ఎక్క‌డో అంటూ అభిమానులు మ‌హేష్‌బాబును సోష‌ల్‌ మీడియాలో అడుగుతుంటే తాజాగా దుబాయ్‌లో షూటింగ్‌లో పాల్గొంటున్న మహేష్ బాబు మాత్రం తాము ఎక్కడ షూటింగ్ చేస్తున్నది తెలిపి అందరికి తెలిసేలా చేశాడు.
 
ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా దుబాయ్‌లో ఎక్కడ షూటింగ్ చేస్తున్న విషయాన్నీ పోస్ట్ చేసారు. దుబాయ్ లోని ఇన్ 5 బిల్డింగ్‌లో షూటింగ్ చేస్తున్నామని, ఆ పక్కనే ఉన్న ఎడారి లాంటి ప్రాంతం చాలా బాగుందంటూ పోస్ట్ పెట్టాడు మహేష్. ఈ చిత్రం మన దేశంలో చోటుచేసుకుంటున్న బ్యాంకు కుంభకోణాల నేపథ్యంతో తెరకెక్కుతోందని టాక్. తాజాగా తొలి షెడ్యూలు దుబాయ్‌లో మొదలైంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇరవై రోజులపాటు అక్కడే షూటింగ్ జరుపుతార‌ని తెలుస్తోంది.