ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 29 జనవరి 2021 (16:14 IST)

సంక్రాంతికి వస్తోన్న సర్కారు వారి పాట

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా మూవీ సర్కారు వారి పాట. పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే మొదలైంది. మహేష్ బాబు దుబాయ్ వెళ్లడంతో షూటింగ్ దుబాయ్‌లోనే జరుగుతుందని అందరూ భావిస్తున్నారు. అయితే గత రెండు మూడు రోజుల నుంచి టాలీవుడ్‌లో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న అన్ని సినిమాలు రిలీజ్ డేట్‌లు ప్రకటించాయి.
 
వారందరితో పాటు మహేష్ బాబు సినిమా యూనిట్ కూడా రిలీజ్ డేట్ ప్రకటించింది. ఇది ఒక రకంగా రిలీజ్ డేట్ అనే కంటే సంక్రాంతి సీజన్ మీద కర్చీఫ్ వేయడం అని చెప్పచ్చు. అంటే ముందు కానే సంక్రాంతికి వస్తున్నామంటూ ప్రకటించింది. 
 
నిజానికి చాలా సినిమాలు షూటింగ్ దశలో ఉండటంతో ఎవరు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని టెన్షన్ నెలకొంది. ఈ క్రమంలోనే ఎలాంటి రిలీజ్ డేట్ క్లాష్ లు రాకుండా ముందుగానే అందరూ రిలీజ్ డేట్స్ ప్రకటిస్తున్నారు.