గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డివి
Last Modified: శనివారం, 16 జనవరి 2021 (17:46 IST)

రోజురోజుకూ మ‌హేశ్‌ అందం పెరుగుతోంద‌ట‌!

మ‌నిషి రోజు రోజుకూ వ్య‌త్యాసం క‌న్పిస్తుంది. భౌతికంగా కొంద‌రు ఎప్పుడు చూసిన ఒకేలా అనిపిస్తారు. అలాంటివారు చాలా అరుదుగా క‌న్పిస్తారు. ఇక మ‌హేష్‌బాబు లాంటి వారు రోజు రోజుకూ మ‌రింత అందంగా వ‌య‌స్సు త‌గ్గిన‌ట్లుగా క‌న్పిస్తున్నాడ‌ని... మంచు విష్ణు కితాబిస్తున్నాడు.
 
సంక్రాంతి సంద‌ర్భంగా మ‌హేష్ ఫ్యామిలీతో మంచు విష్ణు ప్యామిలీ క‌లిసిన సంద‌ర్భంగా దిగిన ఫొటోను ఆయ‌న ట్వీట్ చేశాడు. ఇందులో రోజు రోజుకూ వ‌య‌స్సు త‌గ్గిన‌ట్టు క‌న్పించ‌డానికి కార‌ణం.. మ‌హేష్‌ది గుడ్ నేచ‌ర్ అని.. మంచి హృద‌యం వున్న వ్య‌క్త‌ని.. అందుకే అంత అందంగా ఎప్పుడూ క‌న్పిస్తున్నాడ‌ని చెబుతున్నాడు.
 
ఇక మ‌హేష్‌ బాబు నిర్మాత‌గా మేజ‌ర్ అనే చిత్రం రాబోతుంది. అడ‌వి శేషు హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది విడుద‌ల కాబోతుంది. మంచు విష్ణు త‌న తాజా చిత్రాన్ని ఇంకా ప్ర‌క‌టించాల్సి వుంది. లెక్క ప్ర‌కారం ఈ ఏడాది భ‌క్త క‌న్న‌ప్ప చిత్రం చేయాల్సింది. కానీ కొన్ని అడ్డంకుల వ‌ల్ల వాయిదా ప‌డిన‌ట్లు తెలుస్తోంది.