బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 11 జనవరి 2021 (21:11 IST)

సుకుమార్ పైన మహేష్ బాబుకి నమ్మకం వున్నట్లేనా?

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ 51వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. టాలీవుడ్ టాప్ హీరోలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. రంగస్థలం చిత్రంతో టాలీవుడ్ బాక్సాఫీసులను షేక్ చేసిన సుక్కు తాజాగా అల్లు అర్జున్‌తో పుష్ప చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
 
ఐతే మహేష్ బాబుతో చిత్రాన్ని చేస్తారంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వన్ నేనొక్కడినే చిత్రం వచ్చింది కానీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత మళ్లీ ప్రిన్స్ మహేష్ బాబుతో చిత్రాన్ని తీయాలని సుకుమార్ సిద్ధమయ్యారు.
 
పుష్ప చిత్ర కథను ఆయనకు వినిపించారట. కానీ మహేష్ బాబు ఆ స్టోరీపై అంతగా ఆసక్తి చూపలేదట. దాంతో ఆ కథను బన్నీకి చెప్పడం, ఆయన ఓకే చెప్పేయడంతో పుష్ప తెరకెక్కుతోంది. ఇందులో బన్నీ మాస్ క్యారెక్టర్లో నటిస్తున్నాడు. ఇకపోతే మహేష్ బాబుతో చిత్రం ఎప్పుడనేది మాత్రం సస్పెన్సుగా మారింది.